నీలిదళాల కుట్రల్ని కడిగిపారేసిన అనిత!

Thursday, November 21, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద బాధితులకు పెద్దమొత్తాల్లో సాయం అందించి, వారు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృషిచేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని నీలి మీడియా దళాలు మాత్రం.. విషపూరితమైన అబద్ధపు ప్రచారాలను తెరమీదికి తెచ్చి వరదసాయంలో వందల కోట్ల రూపాయల సొమ్ములు కాజేసినట్టుగా ప్రచారం ప్రారంభించారు.

అయితే వీరి కుట్రలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం మంత్రులు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ అనుచర దళాలు చేస్తున్న కుటిలయత్నాలను తిప్పికొట్టడంలో హోంమంత్రి అనిత ఒక రేంజిలో చెలరేగిపోయారు. ఒకటో క్లాసు చదువుకుని వచ్చిన వారికి.. జ్ఞానం అంతే ఉంటుందిలే అంటూ సెటైర్లు వేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అడ్డగోలు ఆరోపణలతో ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించింది. వారు చెబుతున్న ప్రకారం.. వరదముప్పు ఉన్న రోజుల్లో పెట్టిన ఖర్చు కింద ప్రభుత్వం చూపిన లెక్కల్లో వందల కోట్లు కాజేశారని అన్నారు. ప్రజలకు అందించిన భోజనాలకు 534 కోట్లు, వాటర్ బాటిళ్లకు 26 కోట్లు, కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు అందించినందుకు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు జగన్ మీడియా ప్రచారం చేసింది. అయితే ఈ ఆరోపణలన్నీ కూడా అబద్ధాలని  మంత్రులు ధ్వజమెత్తారు.

వరద సాయం కింద మొత్తం ఇప్పటిదాకా, లబ్ధిదారులకు అందించిన సాయం సహా, ఖర్చు పెట్టినదే 601 కోట్లు కాగా.. జగన్ కరపత్రిక ప్రచారం చేస్తున్న వందల కోట్ల అవినీతి ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తంలో ఆహారానికి 92.5 కోట్లు, తాగునీటికి 11.2 కోట్లు, మెడికల కేర్ 4.55 కోట్లు, పారిశుధ్యానికి 22.56 కోట్లు ఖర్చు చేసినెట్టు చెబుతున్నారు.

ప్రభుత్వ వివరాల్లో కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకు 0.23 కోట్లు అని ఉండగా.. జగన్ దళాలు దానిని చదవడం కూడా చేతకాక.. 23 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ప్రచారం చేస్తున్నాయని మంత్రులు ఎద్దేవా చేశారు. ఒకటో క్లాసు చదువుకున్న వారికి జ్ఞానం అంతే ఉంటుందంటూ హోం మంత్రి అనిత ఎద్దేవా చేయడం విశేషం.
జగన్మోహన్ రెడ్డి కోటిరూపాయల విరాళం అది కూడా తన సొంత డబ్బు కాకుండా, పార్టీ తరఫున ప్రకటించి.. ఆచరణలో ఎక్కడ సాయానికి ఆ ఖర్చు పెట్టారో కూడా చెప్పకుండా ప్రజలను వంచించారు.

ఆ కోటి ఎక్కడ అని ప్రశ్నించినందుకు.. తెదేపా వారి మీద విరుచుకుపడుతున్నారు. ఖర్చుల విషయంలో మంత్రులు క్లారిటీతో మొత్తం లెక్కలు వివరించిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ అబద్ధాలను సమర్థించుకోవడానికి ఏ కొత్త మార్గాలు తొక్కుతుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles