పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజి”పై ఎప్పటి నుంచో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో రెండో పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ, కొత్త అప్‌డేట్ మాత్రం పాట గురించి కాదు. ఈసారి సినిమా టీమ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌నే బయటకు తీసుకురాబోతున్నారని సమాచారం వస్తోంది. ఇప్పటి వరకు ఆమె పాత్రపై ఎలాంటి వివరాలు బయటకు రాకపోవడంతో ఈ ఫస్ట్ లుక్ కోసం అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే ఇది కేవలం పోస్టరా, లేక పూర్తిస్థాయి ఫస్ట్ లుక్కా అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తోంది.
