ఎన్ఆర్‌టీల ఔన్నత్యం చాటేలా ‘ఐకాన్’!

Wednesday, April 9, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన అయిదేళ్ల కాలంలో.. రాష్ట్రాన్ని ఏ విధ్వంసపు అంచులకు నెట్టవచ్చునో అంతవరకూ నెట్టాడు. చంద్రబాబునాయుడుకు కీర్తి దక్కుతుందనే దుగ్ధతో అమరావతి ప్రాంతాన్ని శ్మశానంగా మార్చేయడానికి వందల కుట్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి.. అదే పనిగా ఆ రాజధానిపై విషం కక్కారు. అమరావతి అంటే రాష్ట్రం యొక్క గౌరవం పెంచే లక్ష ఒక రాజధానిగా చూడలేకపోయిన జగన్.. దానిని లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అంటూ ప్రజలను మోసం చేశారు. ఆయన పాలన ఎంత దుర్మార్గంగా వ్యవహరించినదంటే.. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ప్రెవేటు పెట్టుబడులతో నిర్మాణం కావడానికి సిద్ధమైన ఐకానిక్ భవనాలను కూడా ఆయన తన ప్రభుత్వం రాగానే తుంగలో తొక్కేశారు. అలాంటి వాటిలో ఎన్ఆర్‌టీ ఐకాన్ కూడా ఒకటి. 36 అంతస్తుల ఈ ప్రతిష్ఠాత్మక భవనం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తిరిగి ఊపిరులొస్తున్నాయి. ఎన్ఆర్‌టీ ఐకాన్ నిర్మాణానికి తాజాగా టెండర్లు పిలుస్తున్నారు.

పూర్తిగా ఎన్ఆర్ఐల ఖర్చుతో 36 అంతస్తుల్లో ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో ఒక భవనం నిర్మించడానికి గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. 2014-19 మధ్య కాలంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఈ భవనం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. డిజైన్లు కూడా సిద్ధం అయ్యాయి. అమరావతి అనే పేరు గుర్తుకు వచ్చేలాగా.. ఇంగ్లిషు ఏ అక్షరం ఆకారంలో నిర్మాణానికి డిజైన్లు రూపొందించారు. 36 అంతస్తుల రెండు టవర్లుగా ప్లాన్ చేశారు. వాటి మధ్యలో ఒక గ్లోబ్ లాంటి నిర్మాణం అనుకున్నారు. దీనిని పూర్తిగా ఎన్నారైల ఖర్చుతోనే నిర్మించాలని.. ఇక్కడి నివాస ఫ్లాట్లు, ఆఫీసు ఫ్లాట్లు కూడా పూర్తిగా ఎన్నారైలకే కేటాయించాలనేది ప్లాన్.
దీనివలన ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకపోయినప్పటికీ.. జగన్ తను అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని కూడా తొక్కేశారు. ఇప్పుడు కూటమి వచ్చాక.. ఎన్ఆర్‌టీ ఐకాన్ భవన నిర్మాణ ప్రయత్నాలు పునః ప్రారంభం అయ్యాయి. మూడు దశలుగా దీనిని నిర్మించబోతున్నారు. తొలుత ఫౌండేషన్ నిర్మాణం పూర్తిచేసి, ఆ తర్వాత భవనం సూపర్ స్ట్రక్చర్ కు టెండర్లు పిలుస్తారు. అలాగే.. అదంతా పూర్తయ్యాక.. భవనం వెలుపలికి కనిపించే అందమైన రూపం ఇవ్వడానికి ఫసాడ్ నిర్మాణానికి విడిగా టెండర్లు పిలుస్తారు. ప్రస్తుతం 10తేదీ గడువుతో ఫౌండేషన్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి ప్రారంభించనున్నారు. మొత్తానికి 2028లోగా ఈ నిర్మాణం పూర్తిచేయాలనేది సంకల్పంగా పనులు ప్రారంభిస్తున్నారు.

52 వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న పనులన్నీ 2027 నాటికే ఒక కొలిక్కి తీసుకురావాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాటితో పాటు.. ఇలాంటి నిర్మాణలు, కేంద్ర ప్రభుత్వ, ఇతర సంస్థలకు కేటాయిస్తున్న స్థలాల్లో నిర్మాణాలు అన్నీ పూర్తయితే గనుక.. అమరావతి అప్పటకీ ఎంతో వైభవంగా తయారవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles