స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆల్ఫా గ‌ర్ల్స్!

Monday, July 8, 2024

బాలీవుడ్ లో య‌శ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్ కు ఓ ప్ర‌త్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్పై యూనివ‌ర్స్ లో ఇప్ప‌టికే వ‌చ్చిన సినిమాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పై యూనివ‌ర్స్ లోకి తాజాగా ‘ఆల్ఫా గర్ల్స్’ ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం హీరోలే ఈ స్పై యూనివ‌ర్స్ లో ఉండ‌గా, ఇప్పుడు హీరోయిన్లు మెయిల్ లీడ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఫీమేల్ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్ తో య‌శ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఆల్ఫా గ‌ర్ల్స్’ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ఆలియా భట్ తో పాటు మ‌రో న‌టి శ‌ర్వారీ కూడా యాక్ట్‌ చేస్తుంది. ”గ్రీక్ ఆల్ఫాబెట్ లో తొలి అక్ష‌రం.. మ‌న ప్రోగ్రాం మోటో..” అంటూ ఓ ప‌వ‌ర్ఫుల్ డైలాగ్ తో ఈ సినిమా టైటిల్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు య‌శ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్ లో ఏక్ థా టైగ‌ర్, టైగ‌ర్ జిందా హై, వార్, ప‌ఠాన్, టైగ‌ర్ 3 చిత్రాలు విడుదల అయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ స్పై యూనివ‌ర్స్ లో ప‌ఠాన్-2, టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్, వార్-2 చిత్రాలు త్వరలోనే రానున్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles