తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తాజా విజయాల్లో మిరాయ్ సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం రిలీజ్‌కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. విడుదలయ్యాక మాత్రం అంచనాలను అందుకుని భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గట్టి హిట్‌గా నిలిచింది.
మొత్తం ఐదు రోజుల ప్రదర్శనలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది. అంతేకాకుండా అమెరికా బాక్సాఫీస్‌లో కూడా మిరాయ్ తన దూకుడు చూపించింది. కేవలం కొన్ని రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను అందుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
తేజ సజ్జకి ఇది కెరీర్‌లో రెండో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా కావడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గౌర హరి స్వరపరిచిన పాటలు సినిమాకి మంచి బలాన్నిచ్చాయి. మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
