ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ మూవీలో అలియా?

Wednesday, January 22, 2025

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాను టాలీవుడ్‌ మాస్‌ అండ్‌ యంగ్‌ దర్శకుడు కొరటాల శివ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్టును చిత్ర బృందం సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌ గా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ విలన్‌ గా నటిస్తున్నాడు. దీని తరువాత ఎన్టీఆర్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం అవుతుందని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌ అప్డేట్‌ ని ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే నీల్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

డ్రాగన్‌ అంటే యూరోపియన్‌ సంస్కృతిలో చెడుకి గుర్తు అని అర్థం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన రష్మిక హీరోయిన్‌ గా ఓకే అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ మరో హీరోయిన్‌ గా నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్‌ ని చిత్ర బృందం త్వరలో ఇవ్వనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles