చేతికి గాయామైనప్పటికీ కేన్స్‌ కు బయల్దేరిన ఐశ్వర్య రాయ్‌!

Wednesday, January 22, 2025

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో గడుపుతోంది. కానీ పలు సినిమా ఈవెంట్స్‌ లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తుంది. గతేడాది పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 50 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఐశ్వర్య రాయ్. ఈ మధ్య  ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా వెంట తన కూతురు ఆరాధ్య కూడా ఉంటుంది.

ప్రస్తుతం ఫ్రాన్స్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ కి దేశవిదేశాల నుంచి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరవుతారు. ఐశ్వర్య రాయ్ కూడా ఇండియా తరపున ప్రతి సంవత్సరం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరవుతుంది. తాజాగా నిన్న రాత్రి ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి బయల్దేరి వెళ్తూ కనిపించింది

అయితే ఐశ్వర్య రాయ్ చేతికి దెబ్బ తగిలి కట్టు వేసి ఉంది. ఆ కట్టు ఎలాంటిది అంటే చేతికి బాగా పెద్ద దెబ్బ తగలడం లేదా ఫ్రాక్చర్ అయితే వేసే కట్టు లాంటిది. దీంతో ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్య రాయ్ చేతికి ఏమైంది, ఇలా చేతికి కట్టుతోనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles