జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నిర్మాణాన్ని చాలా వ్యూహాత్మకంగా చేసుకున్నారు. తన తండ్రి వైఎస్సార్ పేరు కలిసి వచ్చేలాగా ఎవరో పార్టీ పెట్టుకుంటే దాన్ని కబ్జా చేశారు. అది తండ్రి పేరునే స్ఫురింపజేసేలా ప్రచారం చేసుకున్నారు. పార్టీ పెట్టిన తొలిరోజుల్లో తండ్రికి సన్నిహితులు ఆత్మీయులైన అనేకమంది నాయకుల్ని చేరదీశారు. తర్వాత అందరినీ బయటకు గెంటేశారు. తనను మాత్రమే కీర్తించే, తన అడుగులకు మడుగులొత్తే వారిని మాత్రమే పార్టీలో ఉండనిచ్చారు. తన తండ్రితో ఉండే సాన్నిహిత్యం కారణంగా తనకు సలహా చెప్పే స్థాయి నాయకులను కూడా ఆయన ఎవ్వరినీ పార్టీలో మిగలనివ్వలేదు.
ఇదంతా వైఎస్సార్ సీపీ గత చరిత్ర కాగా.. ఇప్పుడు వైఎస్ కు అత్యంత ఆత్మీయుల్లో ఒకడైన నాయకుడు.. జగన్ వెలిబుచ్చుతున్న కోరికను కొట్టి పారేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అంటున్నారు. పైగా జగన్ కోరిక వింటోంటే.. ఆయనకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవేమో అనే అనుమానం కలుగుతోందని కూడా ఎద్దేవా చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కొన్ని వారాలుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చిన్న సంఘటన జరిగినా సరే.. వెంటనే ప్రభుత్వం హింసకు పాల్పడుతోందంటూ విరుచుకుపడడం.. ఇలాంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలనడం.. అందుకు గవర్నరు చొరవ తీసుకోవాలని స్టేట్మెంట్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి ఒక ప్యాషన్ అయిపోయింది.
అయితే ఇప్పుడు వైఎస్సార్ కు సన్నిహితుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు.. ఇలాంటి డిమాండ్లను ఖండిస్తున్నారు. రాష్ట్రపతి పాలన గురించి జగన్ అడగడం చూసి జనం నవ్వుకుంటున్నారని గోనె అంటున్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు దేవుడితో సమానం అని అంటూనే.. ఆయన కొడుకుగా..క దయచేసి ఇలాంటి డిమాండ్లతో నవ్వుల పాలుకావొద్దని గోనె జగన్ ను కోరుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన సాధ్యం కూడా కాదని అంటున్నారు.
అయితే కొన్ని రకాల మనుషులకు ఆత్మీయులు చెప్పే హితవాక్యములు చెవికెక్కవు అని చిన్నయసూరి రాసిన పంచతంత్రంలో ఒక సిద్ధాంతం ఉంటుంది. అలా.. జగన్ కు తన మేలు కోరే వాళ్లు చెబుతున్న మాటలు నచ్చుతాయా? అని పలువురు భావిస్తున్నారు.
జగన్ కోర్కెకు తూచ్ అంటున్న వైఎస్ భక్తుడు!
Monday, January 27, 2025