పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పవన్ ఫ్యాన్స్ వేడుకలతో ముస్తాబైపోయారు. ఈ వేడుకల మధ్యలో పవన్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఓజి నుంచి ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్రబృందం ముందే చెప్పింది. సాయంత్రం ఒక బిగ్ ట్రీట్ వస్తుందనే ఉత్సాహం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.
అయితే ఆ అప్‌డేట్ కు ముందు మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ అభిమానులను మరింత ఎగ్జైట్ చేశారు. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పూర్తిగా స్టైలిష్ లుక్ తో కనబడుతూ వింటేజ్ డాడ్జ్ కార్ మీద కూర్చున్నట్టు చూపించారు. కార్ కింద రక్తపాతం ఉన్నట్లు చూపించడం పోస్టర్ కి ఇంకో హైలైట్ గా మారింది. అంటే యాక్షన్ తర్వాత హీరో కూల్‌గా రిలాక్స్ అవుతున్నట్టుగా డిజైన్ చేశారు.
ఈ మాస్ అండ్ క్లాసి ఫీల్ ఇచ్చే పోస్టర్ చూసి పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో జోరుగా రియాక్షన్స్ ఇస్తున్నారు.
