సలహా : బెంగుళూరులో సెటిలైపో జగన్..!

Saturday, April 12, 2025

జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజకీయ ప్రత్యర్థులు అయిన చంద్రబాబునాయుడు లేదా పవన్ కల్యాణ్ గురించి అతి తరచుగా ఝఒక విమర్శ చేస్తుండేవారు. వారికి రాష్ట్రంలో సొంత ఇల్లు కూడా లేదు. వారు గెలిపిస్తే ఇక్కడ ఉండి రాజకీయం చేస్తారు.. ఓడిస్తే.. వెళ్లిపోయి హైదరాబాదులో ఉంటారు.. అని ఎద్దేవా చేస్తుండేవారు. ఆయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు గనుక.. తాను మాత్రమే రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉండే నాయకుడిని అని.. అందుకే తనను గెలిపించాలని ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా చాటుకున్నారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ అచ్చంగా రివర్స్ అయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం బెంగుళూరుకు వెళ్లిపోతున్నారు. నిజం చెప్పాలంటే.. ఆయన పూర్తిగా బెంగుళూరులోనే ఉంటున్నారు. రాష్ట్రంలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు, తమ పార్టీ నాయకులు జైళ్లకు వెళ్లినప్పుడు పరామర్శలు చేయడానికి బెంగుళూరు నుంచి వచ్చి, తిరిగి వీకెండ్ రాగానే అక్కడకు వెళ్లిపోతున్నారు. ఈ తీరునే.. తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు తెలుగుదేశానికి చెందిన శాప్ చైర్మన్ రవినాయుడు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బెంగుళూరులోనే సెటిలపై పోవడం మంచిదని, ఇకపై ఆయనకు రాష్ట్రంలోర రాజకీయ భవిష్యత్తు కూడా ఏమీ లేదని ఆయన అంటున్నారు.

రవినాయుడు మాట్లాడుతూ.. కర్ణాటకలో వ్యాపారాలు చేసుకుంటూ.. పార్టీని కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని అంటున్నారు. ఈ సందర్భంలోనే గతంలో జగన్ చెప్పే మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి. ‘సొంత ఇల్లు లేదు’ అంటూ ఆయన చంద్రబాబు, పవన్ లను హేళన చేశారు. కానీ పవన్ ఎన్నికలకు ముందే అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. అమరావతి రాజధానిలోనే తాను  ఇల్లు కట్టుకుంటానని ఎప్పటినుంచో చెబుతున్న చంద్రబాబునాయుడు, ఇప్పుడు అమరావతి ప్రాంత పనులన్నీ వేగం పుంజుకుంటున్న తరుణంలో.. తాను కూడా అక్కడ ఐదెకరాల స్థలం కొనుక్కుని.. ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. అయినా వారికి సొంత నివాసాలు హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రం ఉండగానే ఏర్పడినవి అనే సంగతి కూడా గుర్తుంచుకోవాలి.

కాకపోతే.. ఇల్లు అనేది నివాసం అనే దృష్టితో కాకుండా.. ఊరూరా ఒక ప్యాలెస్ కట్టుకునే అలవాటు ఉన్న జగన్.. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ రాజకీయం చేస్తుండేవారే గానీ.. ఆయన ఆస్తులకు, వ్యాపారాలకు దందాలకు అన్నింటికీ బెంగుళూరును కేంద్రంగా పెట్టుకున్నారు. అక్కడి యలహంకలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. తర్వాత హైదరాబాదులో, తర్వాత తాడేపల్లిలో, అధికారం దక్కగానే సర్కారు సొమ్ముతో విశాఖలో ఇలా ప్యాలెస్ ల పిచ్చితో గడిపారు. తీరా ప్రజలు ఓడించిన తర్వాత.. ఆయనకు అన్నింటికంటె బెంగుళూరు యలహంక ప్యాలెస్ ప్రీతిపాత్రమైనదిగా మారినట్టు కనిపిస్తోంది. ఆయన నిత్యం అక్కడే గడుపుతుంటారు. అప్పుడప్పుడూ తాడేపల్లి రావడం రెండు మూడురోజులు పార్టీ కార్యకర్తలు, నాయకుల సమీక్ష సమావేశాల పేరిట హడావుడి చేయడం.. తర్వాత బెంగుళూరు వెళ్లిపోయి.. అక్కడే సేదతీరడం.. తన టీమ్ తో ట్విటర్ లో పోస్టులు పెట్టిండచం జగన్ కు అలవాటుగా మారింది. అసలు రాష్ట్రంలో ఉండడానికే ఇష్టపడని జగన్ ను… బెంగుళూరులోనే సెటిలైపోవాల్సిందిగా ఇప్పుడు శాప్ చైర్మన్ ఎద్దేవా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles