లిక్కర్ స్కాం పరిధిలోకి కల్తీ మద్యం మరణాల కేసు!

Friday, December 5, 2025

లిక్కర్ కుంభకోణంతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సంబంధం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు ముందు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇంకేముంది.. ఆల్రెడీ ప్రిలిమనరీ చార్జి షీటు దాఖలు పరచడం కూడా అయిపోయింది కదా.. మహా అయితే అంతిమ లబ్ధిదారు లేదా బిగ్ బాస్ కు సంబంధించి ఒకటి రెండు పేర్లను జోడించి మరో చార్జిషీటు దాఖలు చేస్తారు.. అంతే కదా, అని ఎవరైనా అనుకుంటూ ఉండవచ్చు.  కానీ వ్యవహారం అంతటితో ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు అనేకమంది మాట్లాడుతున్న మాటలను గమనిస్తే మరింత పెద్ద ప్రమాదం, మరింత క్లిష్టమైన కేసు దీనికి జత కలిసే అవకాశం ఉన్నదని అంతా అనుకుంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం లిక్కర్ ధరలను రెట్టింపు కంటే ఎక్కువ పెంచేసి ప్రజలను కొల్లగొట్టడం మాత్రమే కాదు. నకిలీ బ్రాండ్లను తయారు చేయించి కల్తీ మద్యాన్ని కూడా విచ్చలవిడిగా విక్రయించిన వైనం అందరికీ తెలుసు. కేవలం కల్తీ మద్యం బారినపడి జంగారెడ్డిగూడెంలో 20 మంది మరణించిన సంగతి కూడా అందరికీ తెలుసు. జగన్ పాలన కాలంలో కల్తీ మరియు నకిలీ మద్యం యొక్క దుష్ప్రభావాలు ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని ఏ విధంగా హరించాయి అనేది కూడా ప్రధానాంశంగా కేసులు నమోదు కానునట్లు పలువురు అంచనా వేస్తున్నారు.

ఇటీవల షర్మిల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ బ్రాండ్ కల్తీ మద్యం కారణంగా మూడు లక్షల మందికి కిడ్నీలు పాడైపోయాయని.. మూడువేల మందికి పైగా మరణించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అప్పట్లో కల్తీ మద్యం బలి తీసుకున్న ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కొన్ని వారాలుగా కూటమి నాయకులు అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ డిమాండ్ల పర్యవసానంగా జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాల కేసును ఈ లిక్కర్ స్కామ్ తో కలిపి విచారించడానికి పోలీసులు పూనుకోవచ్చునని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే కేవలం మూడున్నర వేల కోట్ల స్వాహా మాత్రమే కాదు 20 ప్రాణాలను బలి తీసుకు నందుకు ఈ కేసు మరింత తీవ్రమైనదిగా మారే అవకాశం ఉంది.
ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఆర్థికనేరంగా మాత్రమే కనిపిస్తూ ఉంది. అందులోనూ హవాలా, అక్రమ లావాదేవీలు, డబ్బును దేశం దాటించడం వంటి అనేక అక్రమాలు తీవ్రమైనవి. వీటికి తోడు కల్తీ మద్యం మరణాల కేసు కూడా జత అయితే.. నిందితుల మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  మరి లిక్కర్ స్కామ్ విషయంలో లేని స్కామ్ ను చంద్రబాబు సృష్టించారని కారుకూతలు కూస్తున్న వైసీపీ దళాలు, కల్తీ మద్యం మరణాల విషయంలో కూడా జరగని మరణాలను చంద్రబాబు సృష్టించారని బుకాయించడానికి ప్రయత్నిస్తారేమో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles