ట్రైలర్ తోనే భయపెడుతున్న అదాశర్మ…

Thursday, June 20, 2024

అదాశర్మ ప్రస్తుతం పాన్ ఇండియా నటిగా ఫుల్‌ బిజీగా ఉంది. వరుస హిట్లను అందుకుంటు అదాశర్మ నేషనల్‌ వైడ్‌ గా ట్రెండ్‌ అవుతుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందర్ని మెప్పిస్తున్నారు. హార్రర్‌, యాక్షన్‌, ఎమోషన్‌ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్ లతో అదా ప్రయోగాలు చేస్తుంది.

చాలా గ్యాప్ తరువాత అదా డైరెక్ట్‌  తెలుగులో ఓ సినిమాను చేస్తుంది. ప్రస్తుతం అదా సీడీ క్రిమినల్‌ ఆర్ డెవిల్ అనే సినిమాతో రాబోతుంది. ది కేరళ స్టోరీ సినిమాతో జాతీయ స్థాయిలో సూపర్‌ హిట్‌ ని తన ఖాతాలో వేసుకున్న అదా ఈ సినిమాలో మెయిన్‌ రోల్‌ చేస్తుంది.
C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం డైరెక్టర్‌ గా ఉన్నారు. ఎస్‌ఎస్‌సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాకి  ఆర్‌ఆర్‌ ధృవన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 10న ఈ సినిమాని  విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు.. ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఈ ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో  వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతుంది.

 ఇక ఈ ట్రైలర్‌లో అదా శర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టేలా చూసే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయనిపిస్తోంది.ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles