అభిషేక్‌ పిక్చర్స్‌ వారి టైటిల్‌ విడుదల!

Sunday, December 22, 2024

కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి అభిషేక్‌ పిక్చర్స్‌ తమ 9 వ చిత్రం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన పలు ఆసక్తికర విషయాలను మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకి నాగబంధం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ప్రకటించారు.

ది సీక్రెట్ ట్రెజర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ వీడియో ను మేకర్స్ విడుదల చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నాగబంధం కాన్సెప్ట్ తో సినిమా ఉండనున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకు అభిషేక్‌ నామా స్క్రీన్‌ పై అందిస్తుండగా.. ఆయనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

దేవాన్ష్‌ నామా ఈ సినిమా ని సమర్పిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. థండర్ స్టూడియోస్‌ సహకారంతో అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles