మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందిస్తున్న తాజా సినిమా “మన శంకర వర ప్రసాద్ గారు”పై సినిమా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తోందనే వార్త మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి.
అనీల్ రావిపూడి సినిమాలు అంటేనే ఫుల్ ఎంటర్‌టైన్మెంట్, ఫ్యామిలీతో కలిసి చూడదగిన హాస్యభరితమైన కథ. అదే స్టైల్లో ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ మధ్య బయటకు వస్తున్న టాక్ ప్రకారం, సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా కనిపించనున్నారని చెప్పుకుంటున్నారు. వీరిద్దరిపై ఒక సూపర్ కామెడీ ఎపిసోడ్ ప్లాన్ చేశారని ఫిలిం నగర్ టాక్. ఆ సన్నివేశం సినిమాలో ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఈ సినిమాలో సంగీతాన్ని భీమ్స్ అందిస్తున్నాడు. పెద్ద స్థాయిలో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
