జైలర్‌ పై ఓ సాలిడ్‌ అప్డేట్‌!

Wednesday, January 8, 2025

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా సూపర్‌ హిట్‌ సినిమాల్లో  డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన సెన్సేషనల్ హిట్ మూవీ “జైలర్” గురించి అందరికీ తెలిసిందే. మరి రజినీకి తన రేంజ్ భారీ కం బ్యాక్ లా నిలిచిన ఈ సినిమాకి డైరెక్టర్ సీక్వెల్ ని కూడా ఫిక్స్ చేసిన విషయం అప్పుడే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరి ఈ సీక్వెల్ పై ఇపుడు ఓ సాలిడ్ అప్డేట్ అయితే తాజాగా వినపడుతుంది. దీంతో ఈ సినిమాని తలైవర్ ఈ డిసెంబర్ మొదటి వారం లోనే మొదలు పెట్టేయనున్నట్టుగా సమాచారం.సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఓ సాలిడ్ వీడియో కూడా విడుదల చేసి షూట్ పై అప్డేట్ ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు.

ఆల్రెడీ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో “కూలీ” అనే భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది దాదాపు తన పోర్షన్స్ పూర్తి కావస్తుండగా ఇపుడు జైలర్ 2 కి కూడా తలైవర్ సన్నద్ధం అయ్యిపోయారని టాక్‌ నడుస్తుంది. మొత్తానికి మాత్రం రానున్న రోజుల్లో రజినీకాంత్ నుంచి అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఉండనుంది అని చెప్పాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles