బాలీవుడ్ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌ లో వరుస ఆఫర్లు!

Sunday, December 22, 2024

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి చిత్రం ధఢక్  మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు సూపర్‌ హిట్ సినిమాల్లో నటించించి మెప్పించింది ఈ భామ.

కాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ‘దేవర’. మొదటి సినిమాతోనే స్టార్ హీరో jr.ఎన్టీఆర్‌ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దేవర సినిమా పాన్ ఇండియన్ భాషలలో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది.  

ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్న కూడా ఎంతో సెలెక్టీవ్ గా వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాకు ఒకే చెప్పింది. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్లో  వచ్చిన దసరా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నాని తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసాడు. సుమారు ఏడాది గ్యాప్ తర్వాత ఆ చిత్రానికి కొనసాగింపుగా దసరా -2 ను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.

అందులో భాగంగా నాని కి జతగా నటించేందుకు బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ జాన్వీకి కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. కాగా దసరా-2 కు సికింద్రాబాద్ కథా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఇందుకోసం సారథి స్టూడియోలో భారీ సెట్లు వేయబోతున్నారు. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాని నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles