నా అభిమాన నటుడ్ని కలిశానంటున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు!

Tuesday, May 21, 2024

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా తన రేంజ్‌ ను పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సినిమా షూటింగ్ లేని సమయంలో ముంబై మొత్తం కలియ తిరుగుతున్నాడు.  .

కొద్ది రోజుల క్రితం ఒక డిన్నర్ పార్టీకి తార్‌ తన భార్యతో కలిసి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆయన కార్తికేయ 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. తర్వాత కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా కూడా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాంటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

నేను నాకు ఎంత ఇష్టమైన వ్యక్తి, నటుడు తారక్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది.తారక్‌  చేసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఉన్నతశిఖరాలను అధిరోహిస్తుంటే చాలా ఆనందం అనిపిస్తోంది… జైహో అంటూ ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక దానికి యాక్టర్స్ అంటూ హ్యాష్ టాగ్ పెట్టడం చర్చనీయాంశమైంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles