రాయన్” నుంచి ఓ రాయ పాట వచ్చేసింది!

Wednesday, January 22, 2025

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం  రాయన్. ఈ సినిమా జులై 26, 2024 న ప్రపంచవ్యాప్తంగా గా థియేటర్లలో విడుదలకి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే అభిమానుల నుంచి , ప్రేక్షకుల నుంచి  మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుండి ఓ రాయ అనే పాటను చిత్ర బృందం  విడుదల చేయడం జరిగింది. ఈ లిరికల్ వీడియో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ధనుష్ కెరీర్ లో 50 వ చిత్రంగా తెరకెక్కిన రాయన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles