నమ్మిన వాళ్లకు పండగ.. నమ్మని వాళ్లకు షాక్!

Wednesday, January 22, 2025

నాయకులు ఒక పని చేపడితే.. అందులో భాగస్వాములు కావాలని పబ్లిక్ కు ఆఫర్ ఇస్తే.. ఆ నాయకుడి కార్యసామర్థ్యం మీద కొందరికి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారు ఆ నాయకుడి బాటను అనుసరిస్తారు. కొందరు మాత్రం నమ్మకంతో కాకుండా ఆశతో మాత్రమే అనుసరిస్తారు. అలాంటి వారికి ఒక్కోసారి షాక్ తగలవచ్చు. నమ్మకం లేని వారికి ప్రతికూల ఫలితం ఎదురైతే అందులో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబును నమ్మిన వారికి, నమ్మని వారికి మధ్య అదే జరుగుతోంది.

చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిని సంకల్పించి.. అక్కడ మధ్యతరగతి నివాస సముదాయాలను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. హ్యాపీ నెస్ట్ అని ఆ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. జీ+12 అంతస్తుల ఎత్తుతో ఇంచుమించు చిన్నస్థాయి ఆకాశహర్మ్యాల సముదాయం అన్నమాట. అలాంటి భవనాలతో మొత్తం 1200 ఫ్లాట్లు ఉండేలా రూపకల్పన చేశారు. ఆన్ లైన్ బుకింగులు ఓపెన్ చేయగానే.. దాదాపుగా అన్నీ అమ్ముడైపోయాయి. 13 ఫ్లాట్లు మాత్రం మిగిలాయి. వాటినిర్మాణానికి తొలి అడుగు పడకముందే.. 2019లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చింది.

అమరావతిని మొత్తం మరుభూమిగా మార్చిన జగన్, హాపీ నెస్ట్ ప్రాజెక్టును కూడా అటకెక్కించారు. ఆయన మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో, అమరావతి గురించి నమ్మకం కోల్పోయిన 177 మంది తమ బుకింగులు రద్దు చేసుకుని డబ్బు వెనక్కు తీసుకున్నారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వస్తుందనే నమ్మకం వారికి లేకుండాపోయింది. మొత్తానికి 190 ఫ్లాట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు మీద నమ్మకం ఉన్నవారు.. తమ బుకింగులను కొనసాగించారు.

ఇప్పుడు సర్కారు నిర్మాణ వ్యయభారం పెరిగినా సరే.. పూర్తిచేసి, నమ్మకంతో ఉన్న వారికి 2018లో బుక్ చేసుకున్న ధరకే అప్పగించాలని డిసైడ్ చేసింది. మొత్తం 170 కోట్ల భారం పడుతున్నా సరే.. ప్రభుత్వం అందుకు సిద్ధమైంది. కాకపోతే, నమ్మకం కోల్పోయి బుకింగులు రద్దు చేసుకున్న వారికి షాక్ ఏంటంటే.. ఆ 190 ఫ్లాట్లను కొన్నినెలల తర్వాత.. నిర్మాణాలు కూడా ఒక దశ వరకు వచ్చిన తర్వాత వేలం వేయనున్నారు. 2018లో అమ్మిన దానికంటె ధర సుమారు కోటి రూపాయలు పెరిగినా ఆశ్చర్యంలేదు. వారు ఆ షాక్ లో ఉండిపోగా, చంద్రబాబు మీద నమ్మకంతో కొనసాగిన వారు.. తమ ప్రాపర్టీ ధర పెరుగుతోందని పండగ చేసుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles