విద్యతో పాటు సంస్కృతికి కూడా పెద్దపీట!

Friday, December 5, 2025

ఏపీలోని కూటమి ప్రభుత్వం హైస్కూలు విద్యారంగంలో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. కేవలం విద్య మాత్రమే కాకుండా.. సంస్కృతి లలిత కళలు వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అంతే కాకుండా పిల్లలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు పాఠ్యాంశాల రూపకల్పనలోనే జాగ్రత్తలు తీసుకోనున్నారు. హైస్కూళ్లలో సంగీతం, నృత్యం, కుట్టు శిక్షణ నేర్పే ఉపాధ్యాయులను కూడా నియమించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటించడానికి ప్రభుత్వం సన్నాహాలు చరేస్తోంది. ముందుగా టీచరు పోస్టుల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని అనుకుంటోంది. సర్దుబాటు మొత్తం పూర్తయిన తరువాత..  మిగిలిన ఏర్పాట్లు చేస్తారు. అలాగే బాలికల ఉన్నత పాఠశాలల్లో 220 మంది కంటె ఎక్కువ మంది విద్యార్థినులు ఉన్న చోట సంగీతం, నృత్యం, కుట్టుశిక్షణ వంటివి నేర్పడానికి కూడా టీచర్లను ఏర్పాటు చేస్తారు. అలాగే పాఠశాలలను క్రమబద్ధీకరించడంలో భాగంగా 75 మంది కంటె తక్కువ మంది విద్యార్థులు ఉండే ఉన్నత పాఠశాలలకు ప్రత్యేకంగా హెడ్మాస్టరు, పీఈటీ ఉండరు. అక్కడ ఉండే సీనియరుకే హెడ్మాస్టరు బాధ్యతలు అదనంగా అప్పగిస్తారు.

సంగీతం, నృత్యం, కుట్టుశిక్షణ వంటివి హైస్కూలు స్థాయిలో సబ్జెక్టుగా ప్రవేశపెట్టడం మంచిదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటివల్ల కేవలం సంస్కృతిని పరిరక్షించడం అనే కోణం మాత్రమే కాదు.. విద్యార్థినులకు లలితకళల్లో ప్రవేశం ఏర్పడి.. వారి మానసిక ఆరోగ్యం నిలకడగా ఉండడానికి, వారు జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఎంతో ఉపకరిస్తుందని కూడా అంటున్నారు. సంగీతం నృత్యం లాంటివి మనలో ఖచ్చితంగా ఒత్తిడిని దూరం చేస్తాయని.. వీటిని పాఠశాల స్థాయిలో తీసుకురావడం మంచిదని అంటున్నారు.

అయితే చిన్న అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సంగీతం నృత్యం కుట్టుశిక్షణ లాంటివి.. కేవలం అమ్మాయిలకు మాత్రం ప్రవేశపెట్టడం వారిని వేరు చేసినట్టుగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా కళల్లో  మహిళలను మించి పేరుమోసిన మగవాళ్లు కూడా ఉన్నారు. అలాగే కుట్టుశిక్షణ కూడా ఆడవారి పని అని భావించాల్సిన అవసరం లేదు. కుటుంబానికి సరిపడా చిన్న చిన్న అవసరాలకైనా కుట్టుపని చేసుకోగలిగే నైపుణ్యం మగవారు కూడా కలిగి ఉండడం తప్పేమీ కాదు. కేవలం బాలికల పాఠశాలల్లోనే కాకుండా.. కో ఎడ్యుకేషన్ ఉన్న స్కూళ్లలో కూడా వీటిని ప్రవేశపెట్టి.. నేర్చుకోవడం అనేది ఆప్షనల్ గా పెడితే ఎక్కవ మందికి ఉపయోగం ఉంటుందని.. పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles