డ్యూడ్‌ దివాళి బాంబు!

Tuesday, December 9, 2025

తమిళ యువ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’ ప్రస్తుతం థియేటర్లలో హంగామా చేస్తోంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవల వరుస సెలవులు రావడంతో సినిమా కలెక్షన్లలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్లు బుక్ అయినట్లు టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమా దీపావళి సెలవుల్లో కూడా బలమైన రన్ కొనసాగించే అవకాశం ఉందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల వద్ద మంచి హడావిడి నెలకొనడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.

ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించగా, సంగీతాన్ని సాయి అభ్యంకర్ సమకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles