పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో దర్శకుడు హను రాఘవాపుడితో కలిసి చేస్తున్న పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి. ఇప్పటికే “ది రాజా సాబ్” షూటింగ్ తో పాటు ఈ సినిమా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ రిలీజ్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.
తాజాగా ఈ సినిమా నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు రవిశంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో క్లారిటీ ఇచ్చారు. వారి ప్రకారం, ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ప్రభాస్ అభిమానులకు ఆ సమయం ఒక పెద్ద ఫెస్టివల్ లాంటిదని చెప్పవచ్చు.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ సహా మరికొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
