నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి జోరులో ఉన్నారు. ఇటీవల వరుసగా వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడంతో ఆయన మరోసారి తన మాస్ క్రేజ్‌ను నిరూపించారు. ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీనుతో అఖండ-2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇక మరో వైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా బాలయ్య మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని సమాచారం. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా బలంగా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో బాలయ్య పాత్రకు సంబంధించిన ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను దర్శకుడు ప్రత్యేకంగా రూపొందిస్తున్నాడు.
ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య పాత్రను మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నారని టాక్. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది బాలకృష్ణ కెరీర్‌లో 111వ సినిమా అవుతుంది.
గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్‌కి ఇప్పటికే అఖండ స్థాయి మాస్ ఇమేజ్ ఉన్నందున, ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
