యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఏడాది పూర్తయ్యింది. రిలీజ్ సమయంలోనే ఈ చిత్రం మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కానీ ఆశ్చర్యంగా ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. తాజాగా ఆ వేచి చూసే సమయం ముగిసింది. చివరికి నిర్మాతలు టెలివిజన్ డీల్‌ను పూర్తి చేశారు.
తాజా సమాచారం ప్రకారం స్టార్ గ్రూప్ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. దేవర హిందీ వెర్షన్ అక్టోబర్ 26, 2025న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్ ఛానల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. అంటే హిందీ ప్రేక్షకులు కూడా దేవర యాక్షన్ ఎమోషన్‌లను టీవీ మీద ఆస్వాదించే అవకాశం వచ్చింది.
అయితే తెలుగు వెర్షన్ ప్రసారంపై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. స్టార్ మా ఛానల్ నుండి టెలికాస్ట్ తేదీపై అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించారు. అనిరుధ్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
