ఉస్తాద్‌ భగత్‌ సినిమా గురించి తాజాగా సమాచారం ఏంటంటే..!

Wednesday, December 10, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా “హరిహర వీరమల్లు”, “ఓజీ” సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు వేర్వేరు జానర్స్‌లో ఆయన నటనను మరోసారి గుర్తు చేశాయి. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”పై పూర్తిగా దృష్టి పెట్టారు.

ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. నిర్మాత రవికుమార్ తెలిపిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ముఖ్యమైన భాగాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. రేపటి నుంచి మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని చెప్పారు.

ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. “ఉస్తాద్ భగత్ సింగ్”పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles