ఇటీవల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చకు వచ్చిన హీరోయిన్ అంటే సందేహమే లేకుండా దీపికా పదుకోణే. ఈ మధ్య ఆమె పేరు పలు వివాదాల మధ్య వినిపిస్తోంది. కొన్ని సినిమాల నుంచి ఆమె తప్పించబడిందని, కారణం ఆమె పెట్టిన కొన్ని షరతులేనని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మొదట ఇవన్నీ కేవలం రూమర్స్‌లా కనిపించాయి కానీ, తాజాగా దీపికా స్వయంగా ఈ విషయంపై స్పందించడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
దీపికా చెప్పిన మాటల ప్రకారం, తాను ఒకరోజు షూటింగ్‌లో కేవలం 8 గంటలపాటు మాత్రమే పని చేస్తానని స్పష్టం చేసింది. అదే విషయాన్ని నిర్ధారిస్తూ, తాను అలా పని చేస్తున్నానని, దానిలో తప్పేం లేదని తెలిపింది. అంతేకాకుండా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కూడా ఇదే రీతిలో పనిచేస్తారని, వారిని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించింది.
అలాగే, మన సినిమా రంగంలో ఒక సరైన వ్యవస్థ లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమా ప్రపంచం కూడా ఇతర రంగాల్లా ఒక సిస్టమాటిక్ విధానంలో నడవాలి అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
