పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా చేసే ఆలోచన గతంలో వచ్చింది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు రాలేదు.
ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసిన పవన్, త్వరలో ఈ కొత్త ప్రాజెక్ట్‌కు డేట్స్ కేటాయించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరోలను సురేందర్ రెడ్డి ప్రత్యేకమైన స్టైల్‌లో చూపించడంలో నిపుణుడు కాబట్టి, ఈ సినిమా సెట్స్‌పై ఎప్పుడుకి చేరతుందో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘ఓజీ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్, సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తాడా లేదా అనే విషయం ఇప్పుడు మరింత హైప్ సృష్టిస్తోంది.
