ప్రభాస్‌ క్రేజీ డ్యాన్స్‌ నెంబర్‌!

Friday, December 5, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా “ది రాజా సాబ్” ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ తో నిండిపోనుందనే అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా ప్రభాస్ నుంచి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్ అవుతున్న అభిమానులకు ఈ సినిమా పండుగలా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.

ఇక హీరోయిన్ లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లు నటిస్తున్నారు. ఇటీవల థమన్ ఈ సినిమాలో ప్రభాస్ పై ఒక ఎలక్ట్రిక్ డాన్స్ నెంబర్ ఉందని వెల్లడించగా, ఇప్పుడు మేకర్స్ మాత్రం ఆ ఒక్క పాటే కాదు, మొత్తం రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు.

ఈ పాటలతో కొత్త షెడ్యూల్ షూట్ కూడా ప్రారంభమైందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles