భారతీయ సినిమాల్లో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పాత్రల్లో “బాహుబలి” ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాత్ర ద్వారా ప్రభాస్ తన పేరు మాత్రమే కాకుండా తన ఇమేజ్‌నే మరో స్థాయికి తీసుకెళ్లాడు. నిజంగా చెప్పాలంటే, ఆ రోల్లో ప్రభాస్ తప్ప మరెవరినీ ఊహించడం కూడా కష్టం అనేంతగా అతను బాహుబలి అవతారాన్ని తనదైన స్టైల్లో సజీవం చేశాడు.
అయితే చాలా కాలంగా ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మొదట బాహుబలి పాత్ర కోసం దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ను అనుకున్నారని అప్పటినుంచీ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా నిర్మాత ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, బాహుబలి పాత్ర కోసం మొదటి నుండి తమకు ఒక్క ప్రభాస్ గురించే ఆలోచన వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
దాంతో అన్ని రూమర్స్‌కు బ్రేక్ పడిపోయింది.
