‘ది ప్యారడైజ్’ కోసం రాఘవ్ !

Friday, December 5, 2025

బాలీవుడ్‌లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ జూయాల్, ఇప్పుడు నటుడిగా కూడా తనదైన స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇటీవల రాఘవ్ జూయాల్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. అందులోని రా సీన్స్ చూసి రాఘవ్ చాలా ఎగ్జైటెడ్‌గా ఫీలయ్యాడట. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని సమాచారం.

రాఘవ్ తన రోల్ గురించి మాట్లాడుతూ, ఈ కథను తెరకెక్కిస్తున్న దర్శకుడు శ్రీకాంత్ ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles