విశాఖపట్నంలో అతిపెద్ద స్థాయిలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయించడానికి కూటమి ప్రభుత్వం ఎంత గట్టిగా కృషి చేస్తున్నదో అందరికీ తెలుసు. 200 ఎకరాలను సేకరించి.. గూగుల్ కు అప్పగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. గూగుల్ డేటాసెంటర్ వస్తే.. కొన్ని వేల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సరిగ్గా.. ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారి తరఫున బినామీలుగా పనిచేసే దళారీలకు కంటగింపుగా మారుతోంది. ఒక్క సంస్థ ద్వారా వేల ఉద్యోగాల కల్పన జరిగితే.. ప్రభుత్వానికి దక్కగల మంచి పేరును తలచుకుంటేనే వారికి వణుకు పుడుతోంది. అందుకే అసలు గూగుల్ సంస్థ విశాఖకు రాకుండా చూసేందుకు తమ మార్కు కుట్రలు ప్రారంభించారు.
విషయం ఏంటంటే.. విశాఖలో అతిపెద్ద డేటాసెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన గూగుల్ సంస్థకు 200 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. భూ సేకరణ నిబంధనల ప్రకారం అక్కడ ఉన్న మార్కెట్ ధరకంటె రెండున్నర రెట్లు ఎక్కువగా.. 15 లక్షలరూపాయలు ఒక్కో ఎకరాకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. రైతులు విజ్ఞప్తి చేసుకున్న తరువాత మరో రెండున్నర లక్షలు కలిపి 17.5 లక్షల వంతున ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రైతులందరూ ఆ ధరకు ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సమయంలో.. వైసీపీ కుట్రదారులు రంగంలోకి దిగారు.
ఈ ప్రాంతంలో పలువురు రైతులనుంచి గతంలో జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు, కొందరు అధికారుల బినామీలు.. రైతులతో భూమి కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఒక ఎకరాకు 7 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని, 3.5 లక్షల అడ్వాన్సులు కూడా చెల్లించారు. వందరోజుల్లోగా మిగిలింది చెల్లించి.. భూములు తీసుకుంటాం అని చెప్పారు గానీ.. ఏడాదిన్నర గడిచినా డీల్ పూర్తిచేయలేదు. ఆ రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి 17.5 లక్షల ధరకు అమ్మడానికి సిద్ధమవుతుండగా.. ఒప్పందాలు చేసుకున్న దళారులు రంగప్రవేశం చేసి రైతుల్ని రెచ్చగొడుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చే ధరకంటె తాము ఎక్కువ ఇస్తాం.. అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయించారు. వాటిని కోర్టు కొట్టివేసింది. మళ్లీ కొందరు రైతులను ఇదే ఆఫర్ తో తాము ఎక్కువ ఇస్తాం అంటూ రెచ్చగొట్టి భూసేకరణకు వ్యతిరేకంగా కేసులు వేయిస్తున్నారు. గతంలో ఎకరాకు కేవలం 7 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్న వైసీపీ నాయకులు.. ఇప్పుడు కేవలం గూగుల్ కు స్థలసేకరణ జరగకుండా అడ్డుకోవడం కోసం.. ఎకరాకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 17.5 లక్షలకంటె ఎక్కువ ఇస్తాం అంటూ.. అంటే, ఒక ఎకరాకు పదిలక్షలకు పైగానే వెచ్చించడానికి సిద్ధమవుతూ తమ కుట్రప్రణాళిక అమలు చేయడం వారి దుర్బుద్ధులను బయటపెడుతోందని ప్రజలు అనుకుంటున్నారు.
డబ్బు ఖర్చయినా పర్లేదు.. గూగుల్ ను రానివ్వకూడదు!
Friday, December 5, 2025
