మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ వేగంగా ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నందున, అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మరి దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ఈ చిత్రంలోని మొదటి పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. చిరంజీవికి ఇప్పటికే అనేక సూపర్ హిట్ పాటలు అందించిన ఉదిత్ నారాయణ్, మళ్లీ ఈ సినిమాలోనూ తన స్వరాన్ని అందించటం విశేషం. ఈ సాంగ్ ప్రోమో అనౌన్స్‌మెంట్‌ను అనిల్ రావిపూడి తన ప్రత్యేకమైన స్టైల్‌లో వినోదాత్మకంగా అందించారు.
సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
