కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనే డైరెక్ట్ చేసి హీరోగా నటించిన తాజా చిత్రం కాంతార 1 నేడు గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా కనిపించింది. సినిమా రిలీజ్ అవ్వకముందే మంచి హైప్ క్రియేట్ అవ్వడంతో పాన్ ఇండియా భాషల్లో డే వన్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఈ ఉత్సాహంతో మూవీ మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.
రిలీజ్‌కు ముందు ప్రీ సేల్స్ కొంత మామూలుగానే ఉన్నా, థియేటర్లలో ప్రదర్శన మొదలైన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా పాజిటివ్ మూమెంటం సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం కాంతార 1 తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 80 నుంచి 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశముందని చెప్పుకుంటున్నారు.
ఇక ప్రీ రిలీజ్ బుకింగ్స్‌నే చూసినా 30 కోట్ల మార్క్ దాటిపోయింది. కానీ డే 1 కలెక్షన్స్ మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఓపెనింగ్స్ సాలిడ్‌గా ఉండబోతున్నాయనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
