నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న తాజా చిత్రం అఖండ 2 తాండవంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ సినిమాలకు స్పెషలిస్ట్‌గా పేరొందిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దసరా పండుగ సందర్భంగా చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో బాలయ్య అఖండ గెటప్‌లో ఉగ్రరూపంతో తాండవం చేస్తూ కనిపించడం ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైటెడ్ చేసింది. ఈ లుక్ చూసి బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనుండగా, సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. సంగీతం థమన్ అందిస్తుండగా, మాస్ బీట్‌లతో ఈ సినిమా మరింత హైలైట్ అవుతుందని అంచనా.
