యంగ్ హీరో శ్రీ విష్ణు ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దసరా పండుగ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.
ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ ప్రత్యేకంగా విడుదల చేశారు. ఇందులో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆయన లుక్, స్టోరీ లైన్ సూచనలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు సంగీతాన్ని విజయ్ బుల్గనిన్ అందిస్తున్నాడు.
