సబ్ కమిటీ వేస్తేనే అంత కంగారెందుకు

Friday, December 5, 2025

సోషల్ మీడియాలో వికృత పోకడలను నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ ఇప్పుడే పురుడు పోసుకుంది. వీరు పలుదఫాల అధ్యయనం చేయాల్సిఉంది. పరిశీలనలు సాగించాల్సి ఉంది. అంతిమంగా నివేదిక రూపొందించాల్సి ఉంది. ఆ నివేదిక ఫలితంగా ఆ సూచనలతో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇన్ని దశలకు చెందిన పనులు ఇంకా ప్రారంభం కూడా కాలేదు. ప్రస్తుతానికి కేవలం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు మాత్రమే జరిగింది. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కంగారు మొదలైంది. విమర్శలు చేసే గళాల పీక నొక్కడానికి ఇలాంటి ఉప సంఘం ఏర్పాటు చేశారంటూ అర్థం లేని ఆక్రోశంతో జగన్ దళాలు గగ్గోలు పెడుతున్నాయి.

కేవలం ఉప సంఘం ఏర్పాటుతోనే ఇంత కంగారు పడుతున్నారంటే సోషల్ మీడియా ద్వారా వేల మంది సైకోలను ప్రోత్సహిస్తూ, పేటీఎం బ్యాచ్ లుగా రెచ్చగొడుతూ వారి ద్వారా సమాజంలోని వాతావరణాన్ని కలుషితం చేయడానికి వారు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. ఆ ఆటలు ఈకపై సాగవని ఇప్పుడే ఎంత కంగారు పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు మాజీలు మీడియా ముందుకు వచ్చి.. ఈ సబ్ కమిటీ ఏర్పాటు గురించి తమ భయాలను చాలా జాగ్రత్తగా విమర్శల రూపంలో వినిపించారు. మాజీ మంత్రులు రాజన్నదొర, మేరుగ నాగార్జున, వేణుగోపాలకృష్ణ, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ విషయంపై తమ పార్టీ విధానాన్ని వివరించారు. సోషల్ మీడియా అనేది కేంద్రం పరిధిలోనికి వస్తుందని, తనకు లేని అధికారాలను రాష్ట్రప్రభుత్వం ప్రదర్శిస్తున్నదని, రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం సోషల్ మీడియా సైకోలపై దృష్టిసారిస్తే.. తమ పార్టీ సగం ఖాళీ అయిపోతుందనే భయం వారిలో మెండుగా ఉన్నట్టు కనిపిస్తోంది.
అయినా వైసీపీ నేతలు ఈ సబ్ కమిటీ ఏర్పాటు గురించి మొసలి కన్నీరు కార్చడాన్ని గమనిస్తోంటే.. జాలి పుట్టడం మాత్రమే కాదు నవ్వు వస్తోంది.

సోషల్ మీడియా కట్టడికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందట. ఈ ఉపసంఘం ఏమీ సూచనలు చేయకుండానే ఆ మాట వారెందుకు అంటున్నారో అర్థం కాదు. సబ్ కమిటీ సూచనలు వచ్చిన తర్వాత కేంద్రానికే నివేదిస్తారో ఏమో తెలియదు కదా అనేది ప్రజల వాదన. అలాగే.. చంద్రబాబు నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ తప్పదు.. అని వీరు జోస్యం చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన అయిదేళ్ల కాలమూ.. పుంఖానుపుంఖాలుగా కోర్టులనుంచి అక్షింతలు, మొట్టికాయలు, ఎదురుదెబ్బలు తింటూనే పాలన సాగించారు. కోర్టుతీర్పులను ధిక్కరిస్తూ, పాటించకుండా తన బరితెగింపు ప్రదర్శించారు. అయినా.. ఒంటెత్తు పోకడలతో సోషల్ మీడియాలో అత్యంత సాధారణ విమర్శల పోస్టులు పెట్టిన వృద్ధులను కూడా రోజుల తరబడి పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పి వేధించిన జగన్ సర్కారుకు.. ఒక పద్ధతి ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తేల్చడానికి మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటుచేస్తే.. అది రాజ్యాంగ ఉల్లంఘనగా కనిపించడంలో వింతేముంది అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles