ప్రభాస్‌ మూవీలో ప్రేమమ్‌ ముద్దుగుమ్మ!

Friday, December 5, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్‌గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే “స్పిరిట్”లో నటించబోతున్నాడు. ఈ సినిమాపై మొదటి అనౌన్స్‌మెంట్ వచ్చిందే నుంచి అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ స్థాయిలో ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చాలా ఇంతకు ముందు చూడని రఫ్ లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఆయన పాత్ర చాలా ఇంటెన్స్‌గా, పూర్తిగా డిఫరెంట్ స్టైల్‌లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మొదట హీరోయిన్‌గా దీపికా పదుకొణే పేరు వినిపించినా, ఇప్పుడు ఆమె స్థానంలో త్రుప్తి దిమ్రి ప్రధాన నాయికగా నటించబోతుందట.

అలాగే ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్ కూడా కీలకమైన రోల్ చేయబోతుందని తాజా వార్తలు చెబుతున్నాయి. అయితే ఆమె పాత్ర పాజిటివ్ షేడ్‌లో ఉంటుందా లేదా సెకండ్ లీడ్‌గా కనిపిస్తుందా అన్న విషయం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించవచ్చని, అలాగే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్‌లో భాగం కాబోతున్నారని ఫిలిం వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles