మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న తాజా సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ సినిమాను అనిల్ రావిపూడి పూర్తి ఎంటర్‌టైన్మెంట్ మూడ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా కనిపించబోతున్నారని తెలిసింది. ఇక చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోన్న సంగతి అభిమానులకు తెలిసిందే.
తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి, నయనతార పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆమె శశిరేఖ అనే పాత్రలో కనిపించనుందని వెల్లడించారు. నయనతారతో కలిసి పని చేయడం చాలా మంచి అనుభవమని, ఆమె తన పాత్రతో సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకువచ్చిందని ఆయన చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్‌లో ఒక పాట చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ 2026 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు, అక్టోబర్ 5 నుంచి వెంకటేశ్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం.
