ఓటీటీలోకి జూనియర్‌!

Friday, December 5, 2025

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్తగా హీరోగా పరిచయమైన వారిలో కిరీటి రెడ్డి కూడా ఒకరు. తన మొదటి సినిమా ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, సినిమా యూత్‌లో బాగా కనెక్ట్ అయ్యి హిట్ టాక్ అందుకుంది. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం కిరీటి కెరీర్‌కు మంచి బూస్ట్ అయ్యింది.

ఇక థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ప్రేక్షకులను చేరుకుంటోంది. రిలీజ్ అయిన దాదాపు పది వారాల తర్వాత ఈ చిత్రం ఓటిటీలో అందుబాటులోకి వచ్చింది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలు హక్కులు దక్కించుకుని నేటి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించాయి. థియేటర్లో చూసే అవకాశం కోల్పోయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.

మ్యూజిక్ విషయానికి వస్తే, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు రిలీజ్ సమయంలోనే భారీ హిట్ అయ్యాయి. అలాగే, ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles