హైదరాబాద్‌లో జరిగిన కాంతార: చాప్టర్ 1 తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి తన స్పీచ్‌ను కన్నడలో చెప్పిన విషయం పెద్ద చర్చకు దారి తీసింది. తెలుగు ప్రేక్షకులు ఆ సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యింది.
ఈ విమర్శలపై రిషబ్ శెట్టి తాజాగా స్పందించారు. తాను ఎక్కువగా కన్నడలో ఆలోచిస్తానని, అందుకే సహజంగానే ఆ భాషలో మాట్లాడతానని ఆయన చెప్పాడు. కానీ ఏ భాషనైనా తాను గౌరవిస్తానని, ఎక్కడికి వెళితే అక్కడి భాషకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం తనది అని తెలిపారు. కొన్నిసార్లు తన మాటలు తప్పుగా వెళ్లిపోతాయని, కానీ అన్ని భాషలకు సమాన గౌరవం ఇస్తానని స్పష్టంచేశారు. ఇకపై ఇతర భాషల్లోనూ మాట్లాడటానికి తప్పక కృషి చేస్తానని రిషబ్ చెప్పాడు.
