ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ “అవతార్ 3”. ఈ చిత్రానికి ముందే ఏర్పడిన క్రేజ్ ఇప్పుడు మరింతగా పెరిగిపోతోంది. జేమ్స్ కేమెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ తోనే ఇది కేవలం థియేటర్ లోనే అనుభవించాల్సిన సినిమా అని స్పష్టమైంది. ఆ ట్రైలర్ లో చూపించిన విజువల్స్, టెక్నికల్ స్టాండర్డ్స్ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
ఇక తాజాగా విడుదలైన కొత్త ట్రైలర్ అయితే హైప్ ని మరింత రెట్టింపు చేసింది. అద్భుతమైన విజువల్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు కలిపి చూపించడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఈ ట్రైలర్ ని చూసి బాగా ఎగ్జైట్ అవుతున్నారు.
