పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషించారు.
ఈ సమయంలో టాలీవుడ్ లోని ఇతర చిత్రబృందాలు కూడా ఓజీకి తమ సపోర్ట్ ఇస్తున్నాయి. మిరాయ్ సినిమా టీమ్ ఇప్పటికే తమ సినిమా ఆడుతున్న థియేటర్లలో ఓజీ స్పెషల్ షోలు వేసే అవకాశం కల్పించింది. తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమా నిర్మాత బన్నీ వాస్ కూడా ఈ జాబితాలో చేరారు.
ఓజీ ప్రీమియర్ కోసం లిటిల్ హార్ట్స్ ఆడుతున్న థియేటర్లలో సహకారం ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్‌ను బన్నీ వాస్ ప్రత్యేకంగా అభ్యర్థించారు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఈ సపోర్ట్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.
