ఈ ఏడాదిలో సౌత్ సినిమా పరిశ్రమలో హైప్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో తమిళ్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన “కూలీ” మరియు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “ఓజి” ప్రధానంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు స్థాపించే అవకాశముందని అంటున్నారు.
ప్రస్తుత ఓపెనింగ్స్ ట్రెండ్‌ని చూస్తే, ఓజి ప్రారంభ రోజు వసూళ్ల పరంగా సూపర్ స్టార్ కూలీకు దగ్గరగా ఉండే అవకాశముందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నారు. కూలీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 150 కోట్ల వసూళ్లను సాధించగా, ఓజి కూడా అంతటి రేంజ్‌లో ప్రారంభంలో వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కూలీ ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లతో చెల్లించుకుంది, కానీ ఓజి మొదటి రోజు మాత్రమే భారీ వసూళ్లు సొంతం చేసుకోవచ్చని ఈరోజు ట్రేడ్ అంచనా వేస్తుంది.
