‘జగన్‌పై వేటు’ చట్టం చెప్పిన రఘురామ!

Thursday, December 4, 2025

జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన అయిదేళ్ల కాలంలో.. తన సొంతదైన పులివెందుల రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలుచేసిన మహామహుడు. కాబట్టి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశం కోసం తయారైన రాజ్యాంగం గురించి ఆయనకు అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందులోని అధికారణాల గురించి పట్టింపుకూడా ఉండకపోవచ్చు. అందుకే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. శాసనసభకు రాకుండా ఇంట్లో కూర్చుంటే, ఎక్స్ లో వదరుతూ ఉంటే.. వేటు పడుతుంది బాబూ.. అని రాజ్యాంగం తెలిసిన వారు హెచ్చరిస్తోంటే ఆయన ఎద్దేవా చేస్తున్నారు.

60 రోజులపాటు శాసనసభకు వరసగా గైర్హాజరైతే ఆటోమేటిగ్గా సభ్యత్వం రద్దువుతుందనేది రాజ్యాంగంలో ఉన్న నిబంధనే అది తనకు తెలియదని, అలాంటి నిబంధనలు ఉంటే చెప్పాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన రాజ్యాంగంలోని నిబంధన మారిపోదు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పే ఈ అధికరణాల గురించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడిస్తున్నారు. రాజ్యాంగంలోని 190 (4) లో ఈ విషయం స్పష్టంగా ఉందని ఇదే విషయాన్ని,  187(2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారని రఘురామకృష్ణరాజు అంటున్నారు.

ఆయన మరో కొత్త పాయింట్ కూడా లేవనెత్తుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తనకు ముఖ్యమంత్రితో సమానంగా.. సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. అందుకోసమే ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ఆ హోదా ఇస్తే అంత సమయం ఇవ్వాల్సి వస్తుంది గనుక అది ఇవ్వట్లేదని వాదిస్తున్నారు. కాబట్టే తాను సభకు వెళ్లడం లేదని ప్రజలను మభ్యపెడుతున్నారు. కానీ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులకు రెండు ప్రశ్నలు అడిగే సమయం అవకాశం ప్రశ్నోత్తరాల సమయంలో తప్పకుండా వస్తుందని, కానీ వారెవరూ ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం లేదని రఘురామ అంటున్నారు.. కనీసం ప్రశ్నోత్తరాల సమయంలో ఆ రెండు ప్రశ్నలను సంధించడం ద్వారా ఆయన సరే ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడానికి వారికి ఒక అవకాశం ఉంటుంది. దానిని కూడా వాడుకోకపోవడం గురించి డిప్యూటీ స్పీకర్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

పైగా జగన్ అడిగినట్టుగా ఎక్కువ సమయం హోదా ఇస్తే ఎక్కువ మాట్లాడే సమయం ఆయనకు దక్కుతుందేమో కానీ మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలకు అది వర్తించదు కదా. మరి ఆ పది మంది కూడా ఎందుకు గైర్హాజరవుతున్నట్టు? ఇదంతా ప్రజలను బుకాయించడానికి, ఎమ్మెల్యేలను యూజ్‌లెస్ గా నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదని ప్రజలు అనుకుంటున్నారు. సభకు వెళ్లడం తన కనీస ధర్మమని జగన్ ఎప్పటికి తెలుసుకుంటారో కదా అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles