టాలీవుడ్‌లో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాల్లో కిష్కింధపురి కూడా ఒకటి. ఈ సినిమాను కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. హారర్ సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించడంతో ప్రేక్షకులు థియేటర్లలో థ్రిల్లింగ్ అనుభూతి పొందారు.
రిలీజ్ అయిన వెంటనే సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఆదరణ లభించింది. మొదటి వారం పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం 22 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని సమాచారం. గత చిత్రాల్లో సాయి శ్రీనివాస్ పెద్దగా మెప్పించకపోయినా, ఈ సినిమాపై ఆయనకు ఉన్న నమ్మకం వసూళ్ల రూపంలో ఫలించింది.
ఇక ఈ వారం పెద్దగా కొత్త సినిమాలు లేకపోవడంతో కిష్కింధపురి తో పాటు మిరాయ్ కూడా తమ జోరును కొనసాగించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
