పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ విజయం సాధించిన సినిమా కల్కి 2898 ఎడి అందరికీ గుర్తే. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా, దీపికా పదుకోణ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. సినిమాలో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రిలీజ్ తర్వాత కూడా సీక్వెల్‌లో ఆమె కనిపిస్తారని కొంతకాలం వరకు వార్తలు వచ్చాయి. కానీ ఒకవైపు ఆమె ఉండకపోవచ్చని గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి.
ఇక చివరికి ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. వారు క్లియర్‌గా చెప్పిన ప్రకారం, కల్కి పార్ట్ 2 లో దీపికా ఇక కనిపించరని తేలింది. ఇంత భారీ సినిమా కోసం కావాల్సిన కమిట్మెంట్ చాలా ఎక్కువగా ఉండటంతో ఇకపై ఆమె భాగస్వామ్యం ఉండదని ప్రకటించారు. ఈ అప్‌డేట్ మాత్రం అభిమానులకు ఊహించని ట్విస్ట్ గా మారింది.
