యువ హీరో తేజ సజ్జ, రితికా నాయక్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం మిరాయ్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం, హిందీ వెర్షన్ తో పాటు అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా బలమైన హోల్డ్ చూపిస్తోంది.
ప్రత్యేకంగా యూఎస్ మార్కెట్ లో మిరాయ్ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అక్కడ ఈ సినిమా ఇటీవలే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను దాటింది. అదే వేగాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 2.1 మిలియన్ డాలర్ల మార్క్ ని చేరుకుంది. వీక్ డే రోజుల్లోనే ఇలాంటి వసూళ్లు రావడం సినిమాకు వచ్చిన క్రేజ్ కి నిదర్శనం.
