ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ AA22xA6 ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను అట్లీ తన ప్రత్యేక శైలిలో రూపొందిస్తుండగా, అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కూడా రికార్డులు తిరగరాయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది.
ఇటీవల ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న తర్వాత, వచ్చే అక్టోబర్‌లో అబు దాబిలోని లీవా ఎడారిలో కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓటీటీ రైట్స్ రేస్ మొదలైంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ ముందంజలో ఉందని, ఈ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసిందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్‌లో అల్లు అర్జున్, అట్లీ, నాని, శ్రద్ధా కపూర్, అల్లు అరవింద్, నాగవంశీతో సమావేశమై, డిజిటల్ రైట్స్ విషయంలో పెద్ద డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
