బిగ్ బాస్ నుంచి శ్రేష్టి ఔట్‌!

Friday, December 5, 2025

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఎనిమిది సీజన్లు హిట్ కావడంతో పాటు బిగ్ బాస్ నాన్‌స్టాప్ కూడా బాగానే నడవడంతో, ఇప్పుడు అందరి దృష్టి మొత్తం ఈ కొత్త సీజన్‌పై ఉంది. కానీ మొదటి ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. ఈ రౌండ్‌లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బయటకు వెళ్లారు.

శ్రష్టి షోలోకి అడుగుపెట్టే ముందు, బయట ఉన్నప్పుడు చాలామంది ముసుగులు ధరించి ఉంటారని, కానీ ఇలాంటి రియాల్టీ షోలలోనే ఎవరి నిజమైన స్వభావం బయటపడుతుందని చెప్పింది. ఇప్పుడు ఆమె చెప్పిన ఈ మాటలపైనే నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే, నాగార్జున ఒక టాస్క్‌లో బాక్స్‌లు పగలగొడుతూ కంటెంట్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఆ కాన్సెప్ట్‌ను ఆయన మరో ఎపిసోడ్‌లో కూడా కొనసాగించారు. అదే సమయంలో ప్రియ, మనీష్‌లకు స్పెషల్ క్లాస్ ఇచ్చి, కెప్టెన్ నిర్ణయం ఫైనల్ అని స్పష్టంగా చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles