ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. సినిమాలో ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఆ సీన్‌కి సంబంధించిన గెటప్, సెటప్ రెండూ అద్భుతంగా ఉండి, ప్రేక్షకులకు ఊహించని థ్రిల్ ఇవ్వబోతున్నాయని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం సినిమాలోనే టాప్ హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలవాలని ప్రశాంత్ నీల్ కష్టపడుతున్నాడని తెలుస్తోంది. అందుకే ఆయన స్క్రిప్ట్ విషయంలో ఎటువంటి తొందరపడకుండా, ఎక్కువ సమయం వెచ్చించి పూర్తి చేశాడు. ఫలితంగా, ఆయన ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే ఇది మరింత గ్రాండ్‌గా, బెటర్‌గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
